Aug 01,2022 13:11

ప్రజాశక్తి-కంచికచర్ల (ఎన్‌టిఆర్‌) : కంచికచర్ల మండలంలో కొత్తగా మంజూరైన 643 రకాల సామాజిక పెన్షన్లను నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు పంపిణీ చేశారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో లబ్దిదారులకు ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహనరావు చేతులమీదుగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి బండి మల్లిఖార్జునరావు, జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, గ్రామ సర్పంచి వేల్పుల సునీత, ఉప సర్పంచ్‌ వేమా సురేష్‌ బాబు, ఎంపిడిఓ కె.శిల్పా, ఆర్‌ఐ శిరీష, ఈఓఆర్డీ శ్రీనివాస్‌, గ్రామ కార్యదర్శి కనగాల రవికుమార్‌, వైసిపి నాయకులు గుదే రంగారావు, పరిటాల రాము, తదితరులు పాల్గొన్నారు.