Jul 18,2023 18:08

న్యూఢిల్లీ   :   26 ప్రతిపక్ష పార్టీల కూటమికి మంగళవారం కొత్త పేరు ప్రకటించారు. ప్రతిపక్ష కూటమిని భారత జాతీయ అభివృద్ధి సమ్మిళిత కూటమి (ఇండియా)గా పిలవనున్నట్లు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని గద్దె దించేందుకు 26 ప్రతిపక్ష పార్టీలు సోమవారం సమావేశమైన సంగతి తెలిసిందే. మంగళవారం కర్ణాటక రాజధాని బెంగళూరులో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ కూటమి పేరును ఇండియాగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ పేరును కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సూచించినట్లు తెలిపారు. త్వరలో ముంబయిలో సమావేశం కానున్నట్లు ఖర్గే వెల్లడించారు. సీట్ల పంపకాలు, ప్రచార నిర్వహణ సంబంధిత అంశాలపై ఆ సమావేశంలో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఖర్గే ప్రకటన అనంతరం ఈ వివరాలను బీహార్‌ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ కూడా ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.