May 01,2023 10:40

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఐఎండి అంచనా ప్రకారం తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోందని విపత్తుల సంస్థ ఎండి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ వెల్లడించారు. ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో పిడుగులతో కూడి, అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. మే 1న కోనసీమ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముంది. మే 2న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్‌ఆర్‌, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపారు. రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. భారీ వృక్షాల కింద ఎవరూ ఉండరాదని పేర్కొంది.