ప్రజాశక్తి - కడపఅర్బన్ :రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను వెనక్కి మళ్ళించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తు లన్ని టికీ నిధులు చెల్లించి తక్షణమే పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న డిప్యూటీ సిఎం క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయని భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా కన్వీనర్ రామమోహన్ కో-కన్వీనర్ చంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి రూ.450 కోట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు తరలిస్తూ నిర్ణయించడం దుర్మార్గమన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన నూతన ఇసుక విధానం కారణంగా లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఖాళీ కడుపులతో కుటుంబాలు గడపా ల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికు లకు ప్రభుత్వం ప్రతి నెల10వేల రూపాయలు ఆర్థిక సాయంగా ప్రకటించాలని డిమాండ్ చేసినా ఫలితం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలను కార్మికశాఖ అధికారులు తీసుకుని ఇప్పటివరకు పైసా కూడా కేటా యించకుండా నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని ఇతర శాఖలకు మరలించటం సమం జసం కాదన్నారు. పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు ఈనెల 17న రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇళ్ల ఎదుట కార్మిక సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చారన్నారు. అందులో భాగంగా కడపలో ఉన్న డిప్యూటీ సిఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు జిల్లాలో ఉన్న కార్మికులు అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే రానున్న కాలంలో పోరాటాన్ని మరింత ఉధతం చేయనున్నట్లు వారు హెచ్చరించారు.










