Oct 26,2022 11:05

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో మంగళవారానికి కరోనా రోజువారీ కేసుల సంఖ్య 196 రోజుల కనిష్టానికి చేరుకోవడం ఊరట నిస్తుంది. సోమవారం 63,786 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఉదయానికి 862 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 11న 796 కొత్త కేసులు నమోదయ్యాయి. మళ్లీ చాలా రోజుల తర్వాత కొత్త కేసులు వెయ్యి దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. అలాగే క్రియాశీల కేసులు 22 వేలకు చేరాయి. ప్రస్తుతం దేశంలో 22,549 క్రియాశీల కేసులు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం ఈ వివరాలు తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు మరణించారు. దీంతో మొత్తం మరణాలు 5,28,980కు చేరుకున్నాయి. అలాగే గత 24 గంటల్లో 1,503 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీలు 4.40 కోట్లు(98.76%)కు చేరుకున్నాయి.