Mar 23,2023 18:05

ఇంటర్నెట్‌డెస్క్‌ : చికెన్‌, పన్నీర్‌.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది? అని తెలుసుకోవాలనుందా? మరి వీటిల్లో ఏది తింటే మంచిదో తెలుసుకుందామా..!

పన్నీర్‌ : పన్నీర్‌లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే పన్నీర్‌ హెమోగ్లోబిన్‌ మెరుగుపరుస్తుంది. ఇది బ్రోన్కైటిస్‌, ఆస్తమా, దగ్గు, జలుబు వంటి వ్యాధులు దరిచేరకుండా ఉండేలా శీరరంలో రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి మేలుచేస్తుందని వైద్యులు చెబుతున్నారు. పన్నీర్‌లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు, రక్తం గడ్డ కట్టేందుకు సహాయపడుతుంది.

చికెన్‌ : చికెన్‌ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులోని అమైనోయాసిడ్‌లకు మూలమైన లీన్‌ ప్రొటీన్‌ ఉంటుంది. ఇది కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. గాయాలు తగ్గించడంలోనూ, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చికెన్‌లో విటమిన్‌ బి12 నాడీవ్యవస్థను, జీర్ణ వ్యవస్థను, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఈ రెండింటిలో మీరు ఏది తీసుకున్నా.. ఆరోగ్యానికి మంచిదే అని వైద్యులు చెబుతున్నారు.