ఇంటర్నెట్‌డెస్క్ : రొమ్ముల్లో కణుతులు ఏర్పడడం సహజం. ఆ కణుతులు నొప్పిగా ఉన్నాయా? అవి క్యాన్సర్‌కి గురిచేస్తాయా? వాటి లక్షణాలేంటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? వంటివి తెలుసుకుందామా..!
లక్షణాలు : రెండు రొమ్ముల్లో ఒక రొమ్ము ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. రొమ్ము చనుమొన నుండి ఉత్సర్గ నీరు, లేత పసుపు, ఆకుపచ్చ, గోధుమ లేదా ఎరుపు రంగులో కనిపించవచ్చు. ఇలా కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రెండు రొమ్ముల్లో లేదా.. ఒక రొమ్ములో గుంటలు కనిపిస్తాయి. లేదా రెండు రొమ్ములు బాగా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. రొమ్ములో నొప్పిలేని కణితి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు వైద్యులు వెంటనే కీమోథెరపీ చేస్తారు. అలాగే లంపెక్టమీ, మాస్టెక్టమీ వంటి చికిత్సలను కూడా వైద్యులు సూచిస్తారు. ఈ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే.. కేన్సర్‌కి గురయ్యే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.