ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు) : మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ స్థానిక సర్పంచ్ మరగాల కుప్పం భారతి చిన్నస్వామి (రాము) ఆధ్వర్యంలో ఆదివారం పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఓవైపు పంచాయతీకి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సక్రమంగా రాకపోకపోయినా.. పంచాయతీ ప్రజలకు ఇచ్చిన మాట నిలపడం కోసం సర్పంచ్ కుమారుడు వైసిపి దళిత యువ నాయకుడు మరకాల కుప్పం రాము తన సొంత నిధులతో పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా నిత్యం ప్రజా సేవ చేస్తూ పంచాయతీగా ఆదర్శ పంచాయతీ చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అడుగులు ముందుకు వేస్తున్నారని స్థానిక నేతలు, ప్రజలు కొనియాడారు.










