ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల పరిధిలో పియలేరు గ్రామంలో పంచాయితీ మోటర్, పైప్‌లైన్ గుర్తును తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం నిర్వాహకులు మోటర్ పెట్టడానికి వెళ్లగా అంతా ధ్వంసమై చెల్లాచెదురుగా కనిపించాయి. పంచాయతీ సర్పంచ్ ఆరోగ్యం రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఖాదర్ వలీ, మహిళా పోలీస్ కీర్తన, ఆత్మకూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వీర ఆధ్వర్యంలో ఎస్సై రంగుడు యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.










