ప్రజాశక్తి-వేపాడ (విజయనగరం) : వేపాడ మండలంలో ప్రధాన రహదారి సోంపురం జంక్షన్ నుండి వేపాడ మండల కేంద్రం నుండి ఆనందపురం జంక్షన్ వరకు వెళ్లే రోడ్డు నిర్మాణం విస్తరణ పనులు సరవేగంగా సాగుతున్నాయి. ఈ రోడ్డు పనులలో పలుమార్లు పత్రికలలో నాణ్యత లోపంపై కథనాలు వెలువడుతున్నప్పటికీ గుత్తేదారుడు నిర్లక్ష్యం కారణంగా రెండు రోజులుగా సదిరి మాదిరిగా పడుతున్న వర్షానికి అరిగిపాలెమునకు జగ్గయ్యపేటకు మధ్య కల్లాల వద్ద వేసిన రోడ్డు ఒకవైపు విరిగి బీటలు వారింది. అందుకు గల ప్రధాన కారణం రోడ్డు కిరివైపులా నాణ్యతలేని మట్టి వేయడం వలన ఏ మాత్రం వర్షం వచ్చినా రోడ్డుకు ఇరువైపులా ఉన్న బర్మలు జారిపోతున్నాయి, ఇలా రోడ్డు నిర్మాణం పనులు నాణ్యత లేకుండా చేయడం వలన ప్రజాధనం వఅధా కాదా ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని ప్రయాణికులతో పాటు మండల ప్రజలు కూడా సంబంధిత అధికారులను కోరుతున్నారు.










