ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : గోదావరి తాగునీరు పైప్ లైన్ మరమత్తుల నిమిత్తం తవ్విన గోతిని వెంటనే పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. శుక్రవారం స్థానికులు విలేకరులతో మాట్లాడుతూ ... కడియం నుండి వీరవరం వెళ్లే ప్రధాన రహదారిలో విక్టరీ బజార్ ఎదురుగా గోదావరి పైప్ లైన్ పాడై , నీరు వృథాగా పోతుండడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులు మరమత్తులు చేపట్టి పూర్తి చేశారు. కానీ తవ్వగా వచ్చిన మట్టిని రోడ్డుపై వదిలేశారు. దీనితో వాహనదారులు, ప్రయాణీకులు , ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై మట్టిని తొలగించి , గొయ్యిని పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.










