ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పరిధిలో, వెదురుకుప్పంలోని మొండివెంగనపల్లిలో సర్పంచ్ పోటుగారి లలిత భాస్కర్ ఆధ్వర్యంలో సోమవారం రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 7వ తేదీన జరిగిన మొండివెంగనపల్లిలో గడప గడప కార్యక్రమం జరిగింది. బండమీద ఇండ్లు గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మతు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామిని గ్రామస్తులు కోరారు. అందుకు స్పందించిన సర్పంచ్ పోటుగారి లలితా భాస్కర్ ఈరోజు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. మొండివెంగనపల్లి పంచాయతీ ప్రజల సమస్యలు తీర్చడానికి ఎవరు ముందుకు వచ్చినా వారికి స్వాగతం పలుకుతామని, పంచాయతీ అన్ని రకాల అభివఅద్దే తన లక్ష్యమని సర్పంచ్ లలితా భాస్కర్ తెలిపారు. రోడ్డు మరమ్మతులు చేపట్టడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.










