ప్రజాశక్తి - ఉండ్రాజవరం (తూర్పుగోదావరి) : మండలంలోని పాలంగిలో శ్రీ వాసవిమాత ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సొసైటీ ఆవరణలో పొట్టి శ్రీరాములు, నెంబర్ 1 పాఠశాలలో మహాత్మా గాంధీజీ, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ కొర్లేపర సుబ్బారావు, సెక్రెటరీ సింహాద్రి గుప్తా, వైస్ ప్రెసిడెంట్ కొల్లూరి సోమేశ్వర రావు, కోశాధికారి పథ్వీ, సభ్యులు కోట్ల విజరు, పశ్చిపులుసు పుల్లేశ్వర రావు, ఆత్యం మూర్తి, కోట్ల సత్తిరాజు, నూలు వెంకట సుబ్బారావు, తుమ్మలపల్లి శ్రీనివాసు, నాగావరపు సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.










