Jun 19,2023 12:26

ప్రజాశక్తి-పెరవలి (తూర్పు గోదావరి) : మండలం కొత్తపల్లి అగ్రహారం గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పంపన దానయ్య అకాల మృతికి హైదరాబాదులో ఉన్న నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌ మాజీ శాసనసభ్యులు బూరుగపల్లి శేషారావు ఫోన్‌ ద్వారా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దానయ్య పార్థివదేహన్ని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పలువురు సందర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ వాటర్‌ డిస్టిబూటర్‌ కమిటీ అధ్యక్షులు వేలివెన్ను గ్రామ ఉపాధ్యక్షులు బూరుగపల్లి శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బొడ్డు రామాంజనేయులు, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ రవివర్మ, మండల అధ్యక్షులు అతికాల శ్రీను, మాజీ అధ్యక్షులు సలాది కృష్ణమూర్తి, కోట శ్రీను, అబ్బిశెట్టి, సత్తిరాజు, సలాది శ్రీహరి, బండారు సాయిబాబా, మరిశెట్టి పోతురాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు సందర్శించారు.