May 30,2023 16:31

కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పంలో అన్న క్యాంటీన్‌ నిర్మాణానికి టిడిపి అధినేత చంద్రబాబు భూమిని విరాళంగా ఇచ్చారు. కుప్పంలో టిడిపి, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏడాదిగా అన్న క్యాంటీన్‌ను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. క్యాంటీన్‌ శాశ్వత భవన నిర్మాణానికి కుప్పంలోని పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న 20 సెంట్ల భూమిని చంద్రబాబు విరాళంగా ఇచ్చారు. త్వరలోనే భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెదేపా కుప్పం ఇంఛార్జ్‌ పీఎస్‌ మునిరత్నం ప్రకటించారు. ఈ మేరకు కుప్పంలోని అన్న క్యాంటీన్‌ ట్రస్టుకు భూమి విరాళంగా అందించారు. త్వరలోనే ట్రస్టు పేరుతో భూమిని చంద్రబాబు రిజిస్ట్రేషన్‌ చేయించనున్నట్లు మునిరత్నం తెలిపారు.