Aug 01,2022 10:47

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి (చిత్తూరు) : బైరెడ్డిపల్లి పెద్దచెరువుకట్టకు రెండు వైపులా పిచ్చి మొక్కలతోనిండిపోయి అడవులను తలపించేలా దర్శనమిస్తున్నాయి. సోమవారం ఉదయం మార్నింగ్‌ వాక్‌ వచ్చిన ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప కట్టను పరిశీలించారు. ఇలాగే వదిలేస్తే మరమ్మతులకు లోనవుతుందని వెంటనే స్పందించి తక్షణమే కూలీలను పిలిపించి మరమ్మత్తులను చేపట్టారు. జిల్లా ఎంపీపీల అధ్యక్షులు మొగసాల రెడ్డప్ప అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడుతూ ఇది ఇలాగే వదిలేస్తే మరమ్మతులకు లోన్‌ అవుతుందని ఈ రెండు రోజుల్లో కూలీల సహాయంతో కట్టపై రెండు వైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి కట్టపై చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లేవారికి ఏ విధమైన ఆటంకాలు కలగకుండా చూస్తున్నామని తెలిపారు.