May 11,2023 14:43

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చాకే ధాన్యం కొనుగోలు పెరిగాయి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈనెల 12న చంద్రబాబు పర్యటన జిల్లాలో విజయం కావాలని కోరుతూ టిడిపి కార్యాలయంలో గురువారం రైతులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ.. అకాల వర్షాలకు రైతులు తీవ్ర ఇక్కట్లు పడగా కనీసం అధికారులు, మంత్రులు రాకపోవడంతో రైస్‌ మిల్లు వద్ద ధాన్యం కొనే పరిస్థితి లేదని చెప్పారు. చంద్రబాబు జిల్లాలో పర్యటించగానే అధికారులు, మంత్రులు పర్యటించి రైతులు ధాన్యాన్ని కొనే పరిస్థితి కలిగిందని చెప్పారు. .రైతుల నుంచి అక్రమంగా బస్తాకు 5 కేజీలు సొమ్ము తీసుకున్న ప్రభుత్వం ఆ సొమ్ము రైతులకు తిరిగి ఇవ్వాలని పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 12న చంద్రబాబు తణుకు పర్యటనలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.