గంగాధర నెల్లూరు (చిత్తూరు) : గంగాధర నెల్లూరు మండలం కేంద్రంలోని స్థానిక ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు క్వారీలో గుర్తుతెలియని మృతదేహం బయటపడినట్లు స్థానికులు గుర్తించారు. ఆదివారం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.










