ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామికి జీవితాంతము కృతజ్ఞుడనై ఉంటానని ఎస్ ఆర్ పురం మార్కెట్ కమిటీ డైరెక్టర్ నూతనంగా ఎన్నికైన నల్ల వెంగనపల్లి పంచాయతీ వేపేరి గ్రామానికి చెందిన గఫూర్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం పుత్తూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పెరుమాళ్ పల్లి ఎంపిటిసి సభ్యులు తోకల మురళి రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సిఎం కే.నారాయణ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నేతల అండదండలతో వైసిపి కోసం నియోజకవర్గ స్థాయిలో కష్టపడి పనిచేసి విజయానికి కృషి చేస్తానని గఫూర్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి హామీ ఇచ్చారు.










