ప్రజాశక్తి-నందలూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రను జయప్రదం చేయాలని టిడిపి మండల అధ్యక్షులు జంగం శెట్టి సుబ్బయ్య, మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి గొబ్బిళ్ళ సుబ్బరాయుడు అన్నారు. శుక్రవారం టిడిపి కార్యాలయంలో యువగళం పాదయాత్ర పోస్టర్ను టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బత్యాల చెంగల్ రాయుడు సూచన మేరకు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనవరి 27 నుండి 400రోజులు 4000కిలోమిటర్లు 100 నియోజకవర్గాలలో లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతుంది అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువైందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు రెండు లక్షల 30 వేల ఉద్యోగాలకు ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారన్నారు. నాలుగు సంవత్సరాల గడిచినా కూడా నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదన్నారు. విద్యార్థులకు రియంబర్స్మెంట్ రాక అనేకమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అనేకమంది విద్యార్థులు చదువులు మానేస్తున్నారు. రైతులు గిట్టుబాటు ధరలు లేక సబ్సిడీ విత్తనాలు లేక సబ్సిడీ ఎరువులు లేక సబ్సిడీ లోన్లు లేక అనేక రకాలుగా ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్రకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలన్నారు.










