Jan 21,2023 15:34

ప్రజాశక్తి - బి.కొత్తకోట : తంబళ్లపల్లి నియోజకవర్గం, పీటీఎం మండలం, పట్టెంవాండ్లపల్లె పంచాయతీ,మొరుసుపల్లెకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు వైయస్సార్ బీమా ద్వారా తక్షణ సాయం కింద రూ.10 వేలను మృతుడి భార్య హేమలతకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసమ్మ, నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరుపేదల సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు 3 వేల జబ్బులకు ఉచితంగా వైద్యం అందజేస్తున్నారని కొనియాడారు. పేదప్రజలు ఎవరైనా వ్యాధుల బారినపడి మరణిస్తే వారికి వైయస్సార్ బీమా పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరుగుతోందన్నారు. ఇక తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నిరంతరం ప్రజాశ్రేయస్సుకు పరితపిస్తున్నరని కితాబునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ శోభ, టీఏ లక్ష్మణ్ మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.