Jun 09,2023 16:59

ప్రజాశక్తి-బి.కొత్తకోట : విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు పిటిఎం మండలం టి.సదుంకు చెందిన తలారి జయచంద్ర(28)గా స్థానికులు తెలిపారు. ఇంటి ఆవరణంలోని అల్లనేరేడుకాయల కోయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే జయచంద్ర మృతి చెందాడు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.