ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు అక్రమమని ఉభయ జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసినందుకు సిబిఐ తీరుకు నిరసనగా అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం వైఎస్ఆర్సిపి శ్రేణులతో కలిసి ఆర్.అండ్.బి బంగ్లా వద్ద నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. పాత బస్టాండులో సిబిఐ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ నిరాధారమైన ఆరోపణలతో భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులు రెడ్డి, వైయస్సార్సీపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










