- ఈదురు గాలులకు రాజంపేట మండలం ఆకేపాడు గ్రామ పంచాయతీ పరిధిలో దెబ్బతిన్న అరటి తోటలు
- అరటి తోటలను పరిశీలించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి-రాజంపేట రూరల్ : శనివారం రాత్రి వేసిన ఈదుల గాలులకు రాజంపేట మండలం ఆకెపాడు గ్రామపంచాయతీలో దాదాపు 200 ఎకరాల అరటి తోట దెబ్బతినింది అని తెలుసుకున్న రాజంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి రైతులతో కలిసి పడిపోయిన అరటి తోటలను పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వెంటనే రైతు భరోసా కేంద్రంలో పంట నష్టం నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు ఫోన్ ద్వారా రెవెన్యూ అధికారులకు పంట నష్టం గురించి తెలియజేశారు. రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నష్టపోయిన రైతులకు అండగా ఉంటాడని ఆయన అన్నారు. నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందించడంలో జగనన్న ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంచు రెడ్డి చంద్రమోహన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి రెడ్డి అంజిరెడ్డి పాపినేని వేణుగోపాల్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సుబ్బారెడ్డి గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ప్రసాద్ గ్రామ రెవెన్యూ సహాయకులు నరసింహులు వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.










