- డబ్ల్యుహెచ్‌ఓకు 75 ఏళ్లు
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) డెబ్బయి అయిదో వార్షికోత్సవ వేళ అందరికీ ఆరోగ్యం ఎండమావిగానే మిగిలిపోయింది. విపరీతంగా పెరిగిపోతును ఆర్థిక అసమానతలతో బాటు ఆరోగ్య సంరక్షణ ఒక వ్యాపార సరుకుగా ఎలా మారిపోయిందీ చూస్తున్నాం. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య అసమానతలు, దేశాల మధ్య అసమానతలు తీవ్రమయ్యాయి. మహమ్మారి నుండి నేర్చుకోవడంలో వైఫల్యం, వాతావరణ సంక్షోభంపై ధనిక దేశాలు స్పందిస్తును తీరు ఆందోళన కలిగిస్తునాుయి. లైంగిక ఆరోగ్యం, పునరుత్పత్తి హక్కులు తొలగించబడుతున్నాయి. పేద దేశాలు అధిక రుణభారాన్ని ఎదుర్కోవడం వల్ల వాటి వినాశకర ప్రభావమూ ఆరోగ్య రంగంపై పడుతునుది. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటి ప్రపంచ ద్రవ్య సంస్థలు విధించే షరతులు ప్రజారోగ్య వ్యవస్థను సంకట స్థితిలోకి నెడుతున్నాయి. లాటిన్ అమెరికాలో ప్రగతిశీల, వామపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ముఖ్యంగా వెనిజులా, బ్రెజిల్, చిలీ, హౌండూరస్ వంటి దేశాలు అందరికీ ఆరోగ్యం లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టంగా నిర్వహించడంలో సోషలిస్టు క్యూబా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ప్రజారోగ్యాన్ని ప్రైవేటుపరం చేసే నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక ఆరోగ్యం అత్యంత ఖరీదయిన సరుకుగా మారిపోయింది. దీనికి వ్యతిరేకంగా యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో వామపక్షాలు, ప్రజలు, ప్రజా సంఘాలు ఉద్యమిస్తూనే ఉన్నాయి. డబ్ల్యుహెచ్‌ఓ 75వ వార్షికోత్సవం రోజున ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వతంత్ర ప్రతిపత్తినిదెబ్బతీసేందుకుఅమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ఎలా ప్రయతిుస్తున్నదీ చూస్తునాుము. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇది మరింత నగుంగా బయటపడింది. భారతదేశంలో మోడీ ప్రభుత్వం కోవిడ్ టీకాలను ఉచితంగా ప్రజలకు అందజేయడానికి ఎంతగా మొరాయించినదీ చూశాము. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సార్వత్రిక వ్యాక్సినేషన్ ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశాక టీకాల ఉచిత పంపిణీకి అంగీకరించింది. మరో వైపు కార్పొరేట్ ఆసుపత్రుల్లో టీకాలు అమ్ముకునేందుకు అనుమతించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆరోగ్యం లక్ష్య సాధనకు 'పీపుల్స్ హెల్త్ డిస్పాచ్' కొన్ని సూచనలు చేసింది. పిహెచ్‌సి వ్యవస్థను బలపరచాలని, అందులో పనిచేసే యువ కార్యకర్తల సామర్థ్యానిు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్య రంగానికి జిడిపిలో వాటా గణనీయంగా పెంచాలని కోరింది. ఇందుకోసం వివిధ దేశాల్లో సాగుతున్న పోరాటాలు, ఉద్యమాలను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సలహా ఇచ్చింది.










