ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ దేవి అన్నారు. పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవారం పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. జ్యోతి శ్రీ (514 ), స్పందన (514 ), హేమ ప్రియ ( 503) మార్కులు సాధించినందుకు పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్.ఎం.డి కరీం విద్యార్థులను అభినందించి బహుమతులను అందజేశారు. రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ గుల్జార్ భాష విద్యార్థినులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ విద్యార్థులు చదువు పట్ల ఆసక్తితో ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముజఫర్ అహ్మద్, బీరువాల రెహమాన్, మిల్లర్ కరీం, అబ్దుల్ రెహమాన్, పాఠశాల సిబ్బంది షాజహాన్, రాము తదితరులు పాల్గొన్నారు.










