ప్రజాశక్తి- కలకడ: మండల కేంద్రమైన కలకడ బస్టాండ్ నందు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు కలకడ టౌన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి వై జిలాని భాష తెలిపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు బస్టాండ్ ప్రాంగణంలోకి వచ్చే ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్ర ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు చంద్రమోహన్ (చిట్టిబాబు),బరకం శ్రీనివాసులు రెడ్డి, వై శేఖర్ నాయుడు, రామాంజులు, కరిముల్లా ,ఇమ్రాన్ ,ఇర్ఫాన్, ఖాజా హుస్సేన్, జాఫర్ హుస్సేన్, నౌషద్ భాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు










