Feb 04,2023 16:30

ప్రజాశక్తి-కలకడ : త్రాగునీటి సమస్యను ఎంపీపీ శ్రీదేవి రవికుమార్ ఆధ్వర్యంలో పరిష్కరించబడింది. మండలంలోని బాటవారిపల్లి పంచాయతీ బాటవారిపల్లెలో త్రాగునీటి సమస్య తలెత్తడంతో శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీని అధికారులను కలిసి సమస్య విన్నవించడంతో వెంటనే స్పందించారు. శనివారం గ్రామానికి వెళ్లి త్రాగునీటి సమస్య ఉన్న ప్రాంతంలో గేట్ వాల్స్ మరియు నూతన పైపులైన్లు ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సిహెచ్ నారాయణ, పంచాయతీ కార్యదర్శులు నందిని, ఇంజనీరింగ్ అసిస్టెంట్  చరిష్మాంజలి, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.