Feb 17,2023 16:47

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ :  ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కత్తి నరసింహారెడ్డిని, పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోతుల నాగరాజును మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వామపక్ష నాయకులు శుక్రవారం పట్టణంలో ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నివాస స్థలాలకు వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సి.రవికుమార్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఎస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.