Sep 23,2023 20:20

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న అధికారులు
వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యత
ప్రజాశక్తి-నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ విత్తనం వేసిన దగ్గర నుండి పంట అమ్ముకొనే వరకు రైతుకు అండగా నిలుస్తున్నదని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ దొడ్డంరెడ్డి నిరంజన్‌ బాబు రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ, విత్తనం వేసిన దగ్గర నుండి పంట అమ్ముకొనే వరకు రైతుకు అండగా నిలుస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యలు, సంబంధిత అధికారుల కషి వలన దిగుబడి బాగా వచ్చి మంచి గిట్టు బాటు ధర లభించడంతో నేడు రైతులు ఆనందంగా ఉన్నారన్నారు.
వచ్చే నెల నుండి జిల్లలో వ్యవసాయ సీజన్‌ ప్రారంభమౌచున్నందున వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి నుండి ముందస్తుగా ప్రణాళికలు రూపొందించు కోవాలన్నారు. రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం జరుగుచున్నదని, రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొనేలా వ్యవసాయ శాఖ అధికారులు కషిచేయాలని నిరంజన్‌ బాబు రెడ్డి తెలిపారు. నేడు చిరు ధాన్యాల వినియోగం కూడా బాగా పెరిగిందని, అందుకనుగుణంగా చిరుధాన్యాల సాగుపై రైతులను ప్రోత్సహించాలని ఆయన, వ్యవసాయ అధికారులను కోరారు. జిల్లా ధాన్యం సేకరణకు సంబంధించి పెండింగ్‌ లో హమాలీ, రవాణా చార్జీలను త్వరగా చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీ కూర్మనాథ్‌ మాట్లాడుతూ, జిల్లాలో క్రమం తప్పకుండ గ్రామ, మండల, జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించుకొంటూ, రైతాంగ సమస్యలను ఈ సమావేశాల్లో చర్చించుకోవడం, గతంలో ధాన్యం సేకరణలో ఉత్పన్నమైన సమస్యలను గుర్తించి వాటిని పునరావతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టడంతో నేడు రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించడం జరుగుచున్నదన్నారు. 2023 ఖరీఫ్‌ కాలానికీ 1,76,388 ఎకరాల్లో వ్యవసాయ మరియు ఉద్యాన పంటలు వేయగా, అందులో 1,74,251 ఎకరాల్లో ఈ పంట నమోదు చేయడమైనదని, జిల్లాలో నూటికి నూరు శాతం ఈ క్రాప్‌ బుకింగ్‌, ఈకెవైసి ప్రక్రియ పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. ఈక్రాప్‌ బుకింగ్‌ నమోదులో క్షేత్ర స్థాయిలో పొరపాట్లుకు తావులేకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని, ఎక్కడైనా ప్రభుత్వ పరంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరితే ఏర్పాటుచేయడానికి సిద్దంగా వున్నట్లు తెలిపారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌ సుక్ష్మ నీటి పారుదల పధకం విధివిధానాలు మరియు రాయితీ వివరాలపై రూపొందించిన వాల్‌ పోష్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు కష్ణా రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్‌ రాజు, జిల్లా ఉద్యాన శాఖాధికారి ఎం.వి. సుబ్బారెడ్డి, మత్స్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ నాగేశ్వరరావు, పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కోటేశ్వర రావు, జిల్లా సహకార శాఖాధికారి సుధాభారతి, నాబార్డ్‌ డిడిఎం రవి సింగ్‌, మార్క్‌ ఫెడ్‌ డిఎం పవన్‌, ఏపిఎంఐపి పిడి శ్రీనివాసులు, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వరరావు, మార్కెటింగ్‌ శాఖ ఏ.డి. అనిత కుమారి, ఇరిగేషన్‌ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.