Oct 31,2023 23:54

వ్యవసాయ అంకుర సంస్థలకు గ్రాంటు పంపిణీ

వ్యవసాయ అంకుర సంస్థలకు గ్రాంటు పంపిణీ
ప్రజాశక్తి - క్యాంపస్‌ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ వారి ఆర్‌ కేవివై రఫ్తార్‌ ద్వారా అమలవుతున్న అగ్రి బిజినెస్‌ ఇంక్వేటర్‌ ద్వారా మొదటి, రెండవ బ్యాచ్‌లకు చెందిన వ్యవసాయ అనుబంధ రంగాల అంకుర సంస్థలకు రెండవ విడతగా రూ. 63.80 లక్షల గ్రాంట్‌ పంపిణీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉపకులపతి డాక్టర్‌ శారద జయలక్ష్మి దేవి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ నిధులను అందరూ సక్రమంగా వినియోగించుకొని అంకుర సంస్థల అభివద్ధితోపాటు స్థానికంగా ఉద్యోగ అవకాశాలను పెంపొందించి దేశ ఆర్థిక పరిపుష్టికి తోడ్పాటు అందించాలని కోరారు. తమ తమ అంకుర సంస్థలను అభివద్ధి పథంలో నడిపించి రాబోయే తరపు ఔత్సాహికులకు ఒక దిక్సూచిగా వెలుగొందాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సహ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ సి.రమణ, సమన్వయకర్త డాక్టర్‌ పి. బాల హుస్సేన్‌ రెడ్డి, అగ్రి బిజినెస్‌ మేనేజ్మెంట్‌ హెడ్‌ డాక్టర్‌ పీవీ సత్య గోపాల్‌, ఇంకుబేటర్‌ మేనేజర్‌ లక్ష్మీ తులసి, బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ సంతోష్‌, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 23 మంది అంకుర సంస్థలు ఫౌండర్స్‌ పాల్గొన్నారు.