ఎస్.జె.డబ్ల్యు.హెచ్.ఆర్.సి జిల్లా మహిళా విభాగం ఛైర్ పర్సన్ గా వాణి నియామకం
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : సోసియల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ ఛైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ అన్నమయ్య జిల్లా మహిళా విభాగం ఛైర్పర్సన్ గా డి.వాణిని అధికారికంగా నియమించడం జరిగిందని నేషనల్ బోర్డు కమిటీ డైరెక్టర్ కె.రవి బాబు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్బంగా రవిబాబు మాట్లాడుతూ జాతీయ ఛైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు. అన్నమయ్య జిల్లాలోని మహిళా హక్కుల సమస్యలు, వాటి పరిస్కారం కోసం తాను కృషి చేయాలని సూచించారు. వాణి మాట్లాడుతూ తన మీద నమ్మకం పెట్టుకొని తనకు ఇంతటి గొప్ప భాద్యతలు అప్పగించిన జాతీయ ఛైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన రాజ్యాంగ ఫలాలను అందరికీ దక్కేలా కృషి చేస్తానని అన్నారు. జిల్లాలో మానవ హక్కుల పరిరక్షణ కోసం, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం, రాజ్యాంగ ఫలాలు, హక్కులు అందరికీ దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అని ఎటువంటి కుల, మత, లింగ, రాజకీయ వివక్ష లేకుండా అందరికీ సమన్యాయం జరిగేలా ఎస్.జె.డబ్ల్యూ.హెచ్.ఆర్.సి ద్వారా కృషి చేస్తానని తెలిపారు. సౌత్ ఇండియా చైర్మన్ ఎం.డి నజీముద్దీన్, సౌత్ ఇండియా వర్కింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ హనుమ గౌడ్, స్టేట్ కమిటీ సభ్యులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు.










