Sep 24,2023 18:05

వికలాంగులతో మాట్లాడుతున్న మంత్రి

ప్రజాశక్తి -వెంకటాచలం :వికలాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌ శాఖామంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని వెంకటాచలం వద్దనున్న వికలాంగుల నైపుణ్యాభివద్ది, పునరావాస, సాధికారత సమ్మిళిత కేంద్రం (కాంపోజిట్‌ రీజనల్‌ సెంటర్‌) లో భారతీయ కత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కాకాణి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ ఆనం అరుణమ్మ, తిరుపతిఎం ఎం. గురుమూర్తి లతో కలసి పాల్గొన్నారు. 225 మంది విభిన్న ప్రతిభావంతులకు 38.71 లక్షల రూపాయల విలువగల 316 రకాల ఉపకరణ పరికరాలను పంపిణీ చేశారు.ఈ సంధర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ వికలాంగులకు అండగా వుంటూ వారిలో మానసిక స్థైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. కూర్మనాథ్‌, భారతీయ కత్రిమ అవయవాల తయారీ సంస్థ అలింకో సిఇఒ రవిశంకర్‌, వికలాంగుల నైపుణ్యాభివద్ది, పున రావాస , సాధికారత సమ్మిళిత కేంద్రం డైరెక్టర్‌ రాజ్‌ మణి పాల్‌, జిల్లా పరిషత్‌ సిఇఓ బి చిరంజీవి, వికలాంగుల శాఖ ఎడి అక్బర్‌ ఆలీ, ఆర్డీఏ పిడి సాంబశివారెడ్డి, తహశీల్దార్‌ కష్ణ, ఎంపిడిఓ రమేష్‌ ఉన్నారు.