ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: మండలంలోని కొత్తవారిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లె మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు రిటైర్డ్ హెచ్‌ఎం జి.వి.ప్రసాద్, పాఠశాల ఇన్‌ఛార్జి హెచ్‌ఎం లక్ష్మీపతి అధ్యక్షతన విద్యా సామగ్రి పంపిణీ చేశారు. పిఎన్ ఇందిరమ్మ జ్ఞాపకార్థం రిటైర్డ్ హెచ్‌ఎం జి.వి.ప్రసాద్ రూ.10 వేలు విలువచేసే విద్యా సామగ్రిని 70 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సంస్కారం, క్రమశిక్షణ అలవర్చుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్య బోధన ఉంటుందని తెలిపారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత ఆశయాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంఇఒ ప్రభాకర్‌రెడ్డి, అపర్ణ ప్రసాద్, మాధవిలత, మాధవ, మోహన్, ధనుంజయరెడ్డి పాల్గొన్నారు.










