ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పురపాలక పరిధిలోని స్వచ్ఛ సర్వేక్షన్-2022 క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ఇన్ఫాంట్ పాఠశాలకు చెందిన జి.విశ్వద (9వ తరగతి ) ప్రథమ బహుమతి, మన్నూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన గీతిక ద్వితీయ బహుమతి, జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన ఎస్.జబీల తృతీయ బహుమతి సాధించారు. విజేతలకు శుక్రవారం పురపాలక కార్యాలయంలో మునిసిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, కమిషనర్ ఎం.జనార్దన్‌రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో సామాజిక అవగాహన కల్పించడం కోసం ఈ పోటీలు నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రెడ్డిమాసి రమేష్ నాయుడు, మున్సిపల్ మేనేజర్ పి.శేషఫణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్ పి.శంకర్, వార్డు శానిటేషన్, ఎన్విరాన్మెంటల్ కార్యదర్శులు పాల్గొన్నారు.










