Jun 16,2022 15:49

ప్రజాశక్తి - చిలమత్తూరు : ప్రభుత్వం వేరుశనగ పంటకు భీమా చెల్లించాల్సిందేనని సిపిఎం రాష్ట్ర నాయకులు జి ఓబులు అన్నారు. ఈ మేరకు వీరాపురం సచీవాలయం ఎదుట రైతుల ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. రైతులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓబులు మాట్లాడుతూ అనంతపురం ఉమ్మడి జిల్లాలో ప్రదాన పంటగా ఉన్న వేరుశనగ పంటకు భీమా ఇవ్వము అని సాక్ష్యాత్తు కలెక్టర్ చెప్పడం రైతులను అవమానించడమే అని అన్నారు. సగానికి పైగా వేరుశనగ పంటనే పండిస్తారని అది గుర్తించే ప్రభుత్వం సైతం ప్రతి సంవత్సరం సబ్సీడికి వేరుశనగ కాయలను సైతం రైతు భరోసా కేంద్రాలను పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు. మరీ అధికారులు పంపిణీ చేసిన విత్తనాలు విత్తి పంట చేతికి రాక రైతులు నష్టపోతే నష్టపరిహారం ఇవ్వవల్సిన బాధ్యత అధికారులది కాదా? అని ప్రశ్నించారు. కేవలం వర్షాన్ని అంచనా వేసి వేరుశనగకు పంట ఇవ్వకపోవడం రైతును మోసం చేయడమే అన్నారు. వర్షాపాతం ఎక్కువ కావడం వల్లే గతేడాది వేరుశనగ భూమిలో కుల్లి నష్టపోయారని కనీసం మేత కూడా దొరకలేని పరిస్థితి ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. కేవలం పరిహారం ఇవ్వకుండా ఎగవేసేందుకే వివిధ కారణాలు చెబితే...వేరుశనగ వేసే 50% మంది రైతులకు నష్టపరిహారం అందదని ఆగ్రహించారు.. మొక్క జొన్న, కంది వంటి మిగిలిన పంటలు సాగు చేసిన వారికి పూర్తి విస్థీర్ణానికి కాకుండా అర కొర విస్థీర్ణానికే నష్టపరిహారం పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ లెక్కన రైతులలో పూర్తీగా న్యాయం జరిగిన వారు చాలా తక్కువ మందిగా ఉన్నారని అన్నారు. ఇతర దేశాలని ఆయిల్ ను దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులలో నష్టపరిహారం తో పాటు ప్రోత్సహకాలు ఇచ్చి వేరుశనగను మరింత ప్రోత్సహించాలి కాని ఇంకా తగ్గిస్తూ స్వదేశి దిగుబడిని తగ్గించడం ఎవరిని మోసం చేయడమే ప్రజలు గుర్తించలేనంత మూర్కులు కాదని అన్నారు. వేరుశనగను ప్రోత్సహించాలని వేరుశనగా సాగు తగ్గితే వంట నూనెల ధరలు పరుగుతాయి. ఆహారపదార్థాలలో వాడటం వల్ల పోషక విలువలు పెరుగుతాయి‌. అలాంటి అనంత జిల్లా వాసుల వారసత్వ వేరుశనగను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చిన్నచూపు చూడటం, నష్టపరిహారం ఇవ్వమని బహిరంగంగా చెప్పడం అంటే అనంత రైతులను అవమానించడమే ఆ మాట వెనక్కి తీసుకోవాలి‌ అధిక వర్షపాతం వల్ల వేరుశనగ‌నష్టపోయిన రైతులతో పాటు మిగిలిన ప్రత్యామ్నాయ పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం బేషారత్తుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం సచీవాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ కు రైతుల వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటి సభ్యులు ఫిరంగి ప్రవీణ్ కుమార్, లక్ష్మినారాయణ, రామచంద్ర, నరసింహులు, సుధాకర్ రైతు లు పాల్గొన్నారు.