Sep 30,2020 19:00


చెన్నై : రోజంతా పిపిఇ సూట్‌ ధరించి కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులకు సినీనటి మీనా హ్యాట్యాఫ్‌ తెలిపారు. అసౌకర్యంగా ఉన్న డ్రెస్‌లో ఉన్నప్పటికీ రోగుల బాధల్ని అర్థం చేసుకుని, వారిపట్ల సౌమ్యంగా ప్రవర్తించడం గొప్ప విషయమని అన్నారు. దీంతో వైద్యులపై నాకు గౌరవం ఇంకా పెరిగిందని, మానవత్వంతో మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు చెప్పా‌రు.   ఇటీవల పిపిఇ సూట్‌లో దిగిన ఫొటోను కథానాయిక మీనా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులతో మాట్లాడారు. ఈ సూట్‌ ధరించడంతో అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఉందని అన్నారు. యుద్ధానికి వెళుతున్నట్లు అనిపిస్తోందని, ఇది చాలా అసౌకర్యమైన డ్రెస్‌ అని అన్నారు. చాలా ఉక్కపోతగా, చికాకుగా అనిపించిందని అన్నారు. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ.. చెమట్లు పట్టాయని, చేతులకు గ్లౌజులు ఉండటంతో ముఖం తుడుచుకోవాడానికి కూడా సాధ్యం కాలేదని అన్నారు. కాగా, దృశ్యం -2 సినిమా షూటింగ్‌లో మీనా పాల్గంటున్నారు. ఈ సినిమా కోసం చెన్నై నుండి కేరళకు విమానంలో ప్రయాణించినపుడు ఆమె ఈ సూట్‌ ధరించారు.