Feb 16,2023 16:33

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ జి.రమేష్ బాబు తెలిపారు. సోమవారం ఆయన మండల పరిధిలోని పోలిలో గల రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మండలంలో  అన్ని ఆర్.బి.కె కేంద్రాలలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని..  రైతులందరూ ఈ ఆర్.బి.కె లను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 45 కిలోల బస్తా ఎరువు రూ 266.50 లకు లభిస్తుందని అన్నారు. మండలం వ్యవసాయ అధికారి జి.రాజ కుమారి మాట్లాడుతూ రైతులందరూ పీ.ఎం కిసాన్ కు ఈ.కే.వై.సీ చేయించుకోవాలని రైతులకు సూచన, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన సహాయకుడు 
 పి.చంగల్ రాయుడు, రైతులు పాల్గొన్నారు.