ప్రజాశక్తి-పీలేరు: క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉచిత ఆధునాతన కంటి చూపు పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులోకి రావడం మంచి పరిణామమని వేపులబైలు ఉప సర్పంచ్ విపి పవన్ కుమార్‌రెడ్డి, వైసిపి యువ నాయకులు విపి రమేష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వేపులబైలులో భాస్కర నేత్రాలయ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందఠంగా వారు మాట్లాడుతూ ప్రజలు వైద్య శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ సురేష్, ఆప్తోమెట్రిస్ట్ షౌకత్ అలీ బాష స్థానిక ప్రజలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు వైద్య పరీక్షలు నిర్వహించి, కంటిచూపు సమస్యల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఆహార నియమాల గురించి వారికి తెలియజేశారు. కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ఎల్.జ్ఞాన శేఖర్, డిడిఒఎస్. ఫరూక్, సచివాలయ ఉద్యోగులు, భాస్కర నేత్రాలయ వైద్య సిబ్బంది కె. మాధురి, సోని, సచివాలయ ఉద్యోగులు బి.శివ శంకర్, బి.రాజశేఖర్, దుర్గాప్రసాద్‌రెడ్డి, జి.సుబ్రహ్మణ్యంరెడ్డి, జి.సింధురెడ్డి, బి.మాధురి, ఏఎన్‌ఎం అనసూయమ్మ, ఆశ వర్కర్ శ్రీలతమ్మ, వాలంటీర్లు పాల్గొన్నారు.










