Apr 16,2023 16:17

ప్రజాశక్తి-నందలూరు : అనాధ శవానికి నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆదివారం ఉదయం గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి రైల్వే పంప్ హౌస్ సమీపంలో  యాచకుడు మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి ఎవరు లేకపోవడం సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో సమీపంలోని చేయ్యేరు నదిలో హిందూ సాంప్రదాయ బద్ధంగా అంత్యక్రియల కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఆకెపాటి రమేష్ రెడ్డి, నంద యాదవ్, వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.