ప్రజాశక్తి- తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీమలయప్ప స్వామివారు శంఖుచక్రాలతో యోగముద్రలో బద్రీనారాయణ అలంకారంలో ఐదు తలల చిన్న శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ సందర్శకులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవలో టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఇఒ ఎవి.ధర్మారెడ్డి, తిరుమల పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి తదితరులు పాల్గొన్నారు.










