పాపులర్ టెలివిజన్ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతి (కేబిసి) అతి త్వరలోనే మళ్లీ ప్రసారం కానుంది. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న అమితాబ్ కెేబిసి తర్వాతి సీజన్ కోసం అతి త్వరలోనే షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. అత్యంత భద్రతా ప్రమాణాలు తీసుకుంటూ షోను తిరిగి ప్రారంభిస్తామని స్వయంగా అమితాబ్ వెల్లడించారు. 'జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అన్ని జాగ్రత్తలతో రెండు రోజుల షెడ్యూల్‌ను ఒక్కరోజులోనే పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే టెలివిజన్‌పై కనిపిస్తా' అంటూ అమితాబ్ పేర్కొన్నారు.










