May 24,2023 15:13

ప్రజాశక్తి-కలకడ : ఆరోగ్యం పట్ల అజాగ్రత్త పనికిరాదని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎం.వి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని దేవులపల్లి పంచాయతీ బొజ్జుగుంటపల్లి గ్రామములో వైద్యాధికారి ఎం.వీ.కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం జరిగినది. ఈ ఫ్యామిలీ ఫిజిషన్ కార్యక్రమం గురించి వైద్యాధికారి మాట్లాడుతూ గర్భవతులను త్వరితగతిలో నమోదు చేయాలని వైద్య పరీక్షలు నిర్వహించాలని గర్భవతులలో కష్టతరమైన గర్భవతులను గుర్తించి ఉన్నత స్థాయి వైద్యశాలలకు రెఫెరల్ చేయాలని సాధారణ గర్భవతులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎర్రకోటపల్లిలో కాన్పులు చేయించాలని  10 గ్రాములు రక్తం తక్కువ ఉన్న వారిని గుర్తించి వారికి ఐరన్ సుక్రోజ్ లు.ఐరన్ టాబ్లెట్స్ డబల్ డోసు ఇవ్వాలని తెలిపారు. 50 సంవత్సరాలు పైబడిన వారందరినీ ఫ్యామిలీ పిజిషన్ కార్యక్రమానికి పిలవాలని షుగరు, బిపి. పరీక్షలు నిర్వహించి ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కార్డును సంపూర్ణంగా పూరించాలని గ్రోత్  చార్టు ఐ.ఎఫ్.ఏ. టానికులు వివరములను అందులో పొందుపరచాలని పుట్టిన బిడ్డ నుంచి 18 సంవత్సరాల వరకు వేయవలసిన టీకాలు అన్ని సంపూర్ణంగా పూరించాలని వైద్యాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం. పి.హెచ్. ఈ.ఓ. జి.జయరామయ్య ఎం.పి.హెచ్.ఎస్.  షేక్    ముజీబ్ భాష.ఎం ఎల్ హెచ్ పి   అబ్బురి రాజా సులోచన .  డేటా ఎంట్రీ ఏ.రోజా పైలట్ ఏ.రమేష్ బాబు ఆశకార్యకర్తలు   ఎస్. వి. రమణమ్మ.ఆశ కార్య కర్త  డి రెడ్డమ్మ పాల్గొన్నారు.