Sep 23,2023 20:36

టిడిపి బైక్‌ ర్యాలీ దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా, కందుకూరు నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు సారథ్యంలో కందుకూరులోని పార్టీ కార్యాలయం నుంచి, వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ పుణ్యక్షేత్రం వరకు 35 కిలోమీటర్ల దూరం బైక్‌ ర్యాలీ శనివారం చేపట్టారు. మధ్యలో ప్రతి గ్రామంలోనూ ర్యాలీకి ప్రజలు స్వాగతం పలికారు. బడేవారిపాలెం, పోకూరు, పోలినేనివారి పాలెం, వలేటివారిపాలెం, కాకర్ల పాలెం, చుండి, అయ్యవారిపల్లె, మాలకొండ గ్రామాల్లో స్వాగతం పలికారు. మాలకొండ పై వెలసిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వెలుపల 101 కొబ్బరికాయలు కొట్టారు. నియోజకవర్గ పరిశీలకురాలు కె. కుసుమ కుమారి , వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య ఉన్నారు.