Sep 26,2020 19:05

అబుదాబి : టాస్‌ గెలిచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. యుఎఇలో జరుగుతున్న ఐపిఎల్‌ 2020 మెగా లీగ్‌లో మరో ఆసిక్తకర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబిలోని షేక్‌ జయేద్‌ స్టేడియం వేదికగా డేవిడ్‌ వార్నర్‌ సారథ్యంలోని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, దినేశ్‌ కార్తీక్‌ సారథ్యంలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్‌ జట్టు ఇప్పటికే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పది పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కోల్‌కతా జట్టు కూడా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల భారీ తేడా ఓటమిని చవిచూసింది. ఈ లీగ్‌లో రెండు జట్లు మొదటి మ్యాచ్‌ పరాజయం అయినవే కాబట్టి రెండో మ్యాచ్‌లో అయినా విజయం సాధించి భోణీ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.