యువగళం పాదయాత్రను జయప్రదం చేద్దాం : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
ప్రజాశక్తి-పీలేరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రను విజయవంతం చేద్దామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం వేణుమాహాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన సమావేశాన్ని నిర్వహించారు. మార్చి మొదటి వారంలో పీలేరు మండలంలో జరగనున్న యువగళం పాదయాత్రలో విజయవాడలో చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై పంచాయతీల వారీగా కార్యకర్తలతో ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పిటిసి డాక్టర్ మల్లెల రెడ్డి బాష, మండల పార్టీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు రెడ్డప్ప రెడ్డి, శ్రీనాథరెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










