Apr 19,2023 15:14
  • రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ముద్దులూరు  సుబ్బరామరాజు సమర్ధుడని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుబ్బరామరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షులు గడికోట శ్రీకాంత్ రెడ్డి, రైల్వేకోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, క్షత్రియ నాయకులు శివరామరాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రైతులకు అరుదైన గౌరవంగా ఈ చైర్మన్ పదవిని అందజేయడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రైతుల కోసమే వారి అభ్యున్నతి కోసం మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేసి రైతు సమస్యలను పరిష్కరించాలని అన్నారు ప్రశాంత వాతావరణంలో వందలాదిమంది వైసీపీ కార్యకర్తల మధ్య ఈ ప్రమాణ స్వీకారం జరగడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ మిధున్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ముద్దులూరు సుబ్బరామరాజు వైసీపీ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటూ అందరి మన్నలను పొంది ఉన్నత స్థాయికి ఎదగడం సుబ్బరామరాజుకు అరుదైన గౌరవంగా ఈ పదవి దక్కటం సంతోషమని అన్నారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే కోడూరు పాడిపంటలకు ప్రసిద్ధి చెందిదని మార్కెట్ కమిటీ చైర్మన్ గా  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే అన్ని పథకాలను రైతులకు అందే విధంగా కృషి చేయాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో వైసిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ముప్పాల హేమన వర్మ,వైస్ ఎంపీపీ రామిరెడ్డి ద్వజారెడ్డి, వైసిపి సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి,ఉపసర్పంచి తోట శివ సాయి, అన్నమయ్య జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పంజం సుకుమార్ రెడ్డి,ఆదిరాజు వేణుగోపాల్ రాజు, సాయి కిషోర్ రెడ్డి,వైసిపి సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త సిడి నాగేంద్ర యాదవ్,గుని శెట్టి ప్రశాంతి,జడ్పిటిసి రత్నమ్మ, సర్పంచులు దార్ల చంద్రశేఖర్,సియ్యవరం విష్ణు,ఆనాల కవితా చెంగల్ రెడ్డి,యజ్ఞం చంద్రశేఖర్, గోపి, పి సుబ్రహ్మణ్యం, రామరాజు, నాగేంద్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.