May 07,2023 16:35

ప్రజాశక్తి-కలకడ : అది 10వ తరగతి పరీక్షల్లో నిర్వహించిన పబ్లిక్ పరీక్షలు నందు మండలంలో పసిడిమొగ్గలు పాసయ్యారు.మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాటవారిపల్లి, కోన, ఆదర్శ పాఠశాలలో పరీక్షలు నిర్వహించగా, వారిలో స్థానిక కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాల నందు 30 మంది పరీక్షలు రాయగా వారిలో 25 మంది ఉత్తీర్ణులై 83% సాధించినట్లు ప్రిన్సిపాల్ అనిత తెలిపారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాల నందు 90 మంది పరీక్షలు హాజరు కాక 74 మంది ఉత్తీర్ణులై 82.2% ఉత్తీర్లు సాధించినట్లు ప్రిన్సిపాల్ మలంగ్ షావలి తెలిపారు. ఈ పాఠశాలలో 500కు పైగా మార్కులు 14 మంది సాధించగా, మొదటి శ్రేణిలో 54 మంది, ద్వితీయ శ్రేణిలో 17 మంది, తృతీయ శ్రేణిలో ముగ్గురు పాసైనట్లు ఆయన తెలిపారు. వీరిలో మిథున్ కుమార్ రెడ్డి, సమరీన్ 566 మార్కులు సాధించగా, ఆయిషా భాను 565 మార్కులు సాధించినట్లు తెలిపారు.