ప్రజాశక్తి-కలికిరి : 2023. సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో శ్రీనివాస జూనియర్&డిగ్రీ కాలేజీ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్ పివి శ్రీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి విడుదల ఐన ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలలో ఎంపీసీ విభాగంలో ఎం హేమంత్ కుమార్ 987 /1000 మార్కులు తో రాష్ట్ర మూడో ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. డి ప్రదీప్ 974 మార్కులు,ఎస్ లాలస 973 మార్కులతో ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. బైపిసి విభాగంలో ఎస్ మసేర ఫిర్దోస్ 942/1000 ఏ.హర్షీయా 935/1000 ప్రథమ ద్వితీయ స్థానాల్లో నిలిచారు. సీఇసి విభాగంలో లక్ష్మీ మంజుల 956/1000, జే హరిత తస్కిన్ 954/1000 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరం బైపిసి విభాగంలో ఎస్ తేజబ్ సుహాన 433/440 మార్కులతో రాష్ట్ర మూడో ర్యాంకు సాధించారు. ఎస్ నీరజ 422/440 సాధించారు. ఎంపీసీ విభాగంలో సి దీపక సింధు 458/470 ఎస్ ఆసిన్ 456/470 మార్కులతో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు. సీఈసీ విభాగంలో టీ మహాలక్ష్మి 438/500 ప్రథమ వి నిరంజన్ 437/500 ద్వితీయ స్థానాలు సాధించారు. రాష్ట్రంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ తో పాటు కళాశాల సిబ్బంది అభినందనలు తెలియజేశారు.










