Jun 10,2023 16:54

ప్రజాశక్తి-పీలేరు : ప్రతి విద్యార్థికీ క్రీడలు చాలా అవసరమని ఏఎస్ఓ రామ్మోహన్ తెలిపారు. పీలేరు-మదనపల్లి మార్గంలోని హోత్రిశ్రీ బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన బ్యాట్మింటన్ వేసవి శిక్షణా శిబిరం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి  ఏఎస్ఓ రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులు దృష్ట్యా మనం పీల్చే గాలి, తినే ఆహారం  విషతుల్యం అవుతున్నాయని, శారీరకంగా దృఢంగా లేకపోతే వయసుతో సంబంధం లేకుండా అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. క్రీడల ద్వారా పిల్లలు శారీరక దారుఢ్యంతోపాటు మానసికోల్లాసం పొందుతారని చెప్పారు. క్రీడల్లో రాణించే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపికలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వేసవి శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు నిర్వహించిన  టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో విన్నర్ తాహిర్, రన్నర్ గా రోహిత్ వర్మ నిలిచారు. డబుల్స్ విభాగంలో రోహిత్ వర్మ, సాత్విక్ జంట విన్నర్స్ గా నిలిచారు. విజేతలకు అకాడమీ స్థలదాత వంశీకృష్ణ చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో  త్రి శ్రీ అకాడమీ నిర్వాహకులు, జాతీయ బ్యాట్మింటన్ క్రీడాకారులు, కోచ్ టి.ప్రభాకర్ రెడ్డి, టి.త్రిశ్రీ, ఈ.ఓఆర్.డి జయమ్మ, అకాడమీ సభ్యులు పాల్గొన్నారు.